వైన్స్ టెండర్లలో ఆరె కటికలకు 30 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి
– హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఆరె కటిక అభివృద్ధి సంఘం వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 08, అద్దం న్యూస్ : వైన్స్ టెండర్లలో ఆరె కటికలకు 30 శాతం ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్ ఇవ్వాలని ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనకు వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం అశోక్ దాదా మాట్లాడుతూ… ఆరె కటికలు ఆత్మగౌరవంగా బతకాలంటే గతంలో మాదిరిగా ఆత్మహత్యలు జరుగకుండా ఉండాలంటే వైన్స్ టెండర్లల్లో 30 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ను కల్పించాలన్నారు. రూ.500 కోట్లతో ఆరె కటికలకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, బిసి డి నుంచి బిసి ఎ హోదా కల్పిస్తూ జిఓ తీసుకురావాలన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని మేకల మండీలను ఆధుకీనకరించి ఆరె కటికలకు అప్పగించాలని, ఇంటిగ్రేటెడ్ మటన్ మార్కెట్టల్లో ఆరె కటికలకు పూర్తి హక్కు కల్పిస్తూ జిఓ తేవాలన్నారు. మటన్ వృత్తి, సారా వృత్తి జన్మతః ఆరె కటికలకు గత ప్రభుత్వం 2021లో నూతన ఎక్సైజ్ పాలసీలో సైతం అన్యాయం చేసిందన్నారు. 79 సంవత్సర కాలంలో ఆరె కటికలకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. 2020 నుంచి 2023 వరకు 10 మంది ఉరివేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని 33 జిల్లాల్లోని కలెక్టరేట్లకు వచ్చే వారంలోపు మెమోరాండాలు సమర్పించడం జరుగుతందన్నారు. ప్రభుత్వం వెంటనే ఆరె కటికలకు వైన్స్ టెండర్లల్లో 30 శాతం రిజర్వేషన్ ప్రకటించకపోతే ప్రజాభవన్ ముట్టడిస్తామని హెచ్చించారు. ఈ కార్యక్రమంలో ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నందీశ్వర్, కోశాధికారి కెడి.దినేష్ బాబా, జాయింట్ సెక్రెటరీ నరేష్, ఉపాధ్యక్షుడు జి.రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply