నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.అలివేలు
హైదరాబాద్, మే 31 ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా ఎం.అలివేలు బాధ్యతలు స్వీకరించారు. గ్రంథాలయం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అలివేలు ను హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ… పాఠకులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు బొల్లం మహేందర్, అవినాష్ , వెంకటేష్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, రామ్మోహన్, కృష్ణారెడ్డి, శ్రీకాంత్, మహేష్, శ్రీనివాస నాయక్, మస్తాన్ పాల్గొన్నారు. ![]()

![]()

