Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADడాక్టర్ కె.లక్ష్మణ్‌ను స‌న్మానించిన మాజీ కార్పొరేటర్ ఎ.పావని

డాక్టర్ కె.లక్ష్మణ్‌ను స‌న్మానించిన మాజీ కార్పొరేటర్ ఎ.పావని

📰 Generate e-Paper Clip

రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా పదవీ బాద్యతలు చేపట్టిన
డాక్టర్ కె.లక్ష్మణ్‌ను స‌న్మానించిన మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైద‌రాబాద్‌, మే 30, ( అద్దం న్యూస్ ) :  దేశ రాజకీయాల్లో మరో ఉన్నత స్థానాన్ని అధిరోహించి రాజ్యసభ హౌస్ కమిటీ నూతన చైర్మన్‌గా పదవీ బాధ్య‌తలు చేపట్టిన ఓబీసీ మొర్చ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ స‌భ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ను గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ఘ‌నంగా స‌న్మానించారు. ఈ మేర‌కు శ‌నివారం హైద‌రాబాద్ అశోక్‌న‌గ‌ర్‌లోని ఆయ‌న నివాసంలో ల‌క్ష్మ‌ణ్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా పావ‌ని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్‌ను స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ… దేశ రాజకీయాల్లో తనవంతు భాద్యతలు నిర్వర్తిస్తునే, ముషీరాబాద్ నియోజకవర్గం బిజెపి నాయకులకు, కార్యకర్తలు ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటాన‌న్నారు. అలాగే రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో మునపటి కంటే కూడా భారీ మెజారిటీతో బిజెపి కార్పొరేటర్లను గెలిపించుకొని, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం పై కాషాయ జెండా ఎగురవేసి… మేయర్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందని లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ బిజెపి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆనంద్‌రావు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, ఎం.ఉమేష్, సురేష్ రాజు, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page