27 ఏళ్లుగా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు
తార్నాక, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) : సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక హనుమాన్‌నగర్‌లో గణనాథుడికి మహారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 27 ఏళ్లుగా వినాయక ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం నిర్వహించిన మహారతిలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.

కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డితో పాటు పలువురు మహిళలు హాజరయ్యారు. మహారతి అనంతరం నిర్వహించిన దాండియా కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. దాండియా పాటలకు మహిళలు ఉత్సాహంగా స్టెప్పులేస్తూ సందడి చేశారు. దీంతో హనుమాన్‌నగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ![]()

