Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఅభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌త‌ను పాటించండి

అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌త‌ను పాటించండి

📰 Generate e-Paper Clip

అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌త‌ను పాటించండి
– మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని

హైద‌రాబాద్‌, మే 29, ( అద్దం న్యూస్ ) :    అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌త‌ను పాటించాల‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌ మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని జిహెచ్ఎంసి అధికారుల‌ను కోరారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని కార్పొరేట‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో చివ‌రిసారిగా మంజూరైన కోటి రూపాయ‌ల‌తో చేప‌ట్టిన అభివృద్ధిలో భాగంగా రూ.9 ల‌క్ష‌ల నిధుల‌తో అరుంధతీన‌గ‌ర్ బ‌స్తీలో క‌మ్యూనిటీహాల్ నిర్మాణం, చిక్క‌డ‌ప‌ల్లి బాపూన‌గ‌ర్ బ‌స్తీల్లో క‌మ్యూనిటీహాల్ రెనోవేష‌న్ ప‌నులు శుక్ర‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ప‌నుల‌ను మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని ప‌ర్య‌వేక్షించారు. క‌మ్యూనిటీహాల్ మ‌ర‌మ్మ‌తుల ప‌నుల‌ను వేగ‌వంతంగా పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేవాల‌ని జిహెచ్ఎంసి అధికారుల‌కు పావ‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆనంద్ రావు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, ఎం.ఉమేష్, సాయి గౌడ్, బస్తీ నాయకులు రాజు, రేవంత్, ఉదయ్, సాయి తేజ, క్రాంతి, భాగ్య, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page