Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఈ నెల 29న జరిగే యుద్ధ వ్యతిరేక ర్యాలీని విజయవంతం చేయండి

ఈ నెల 29న జరిగే యుద్ధ వ్యతిరేక ర్యాలీని విజయవంతం చేయండి

📰 Generate e-Paper Clip

ఈ నెల 29న జరిగే యుద్ధ వ్యతిరేక ర్యాలీని విజయవంతం చేయండి
» వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు

హైదరాబాద్, మార్చి 24, అద్దం న్యూస్ :   ఈ నెల 29న జరిగే యుద్ధ వ్యతిరేక ర్యాలీని విజయవంతం చేయాల‌ని వామపక్ష విద్యార్థి సంఘాల నాయ‌కులు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్‌లో యుద్ధ వ్యతిరేక ర్యాలీకి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మహేష్, పొడపంగి నాగరాజు, పిడిఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరు విజయ్ లు మాట్లాడుతూ… మానవాళిని వీడి యుద్ధానికి వ్యతిరేకంగా గళమెత్తి నిలబడాల‌న్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ధారాళంగా చేస్తున్న అక్రమ యుద్ధాలను ఖండిద్దామ‌న్నారు. ఈ నెల 29 వ తేది ఉదయం 10:30 గంటలకు చార్మినార్ నుండి బషీర్‌బాగ్ గ్రౌండ్స్ వరకు అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న పాలస్తీనా పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. రెండో దశలో మానవత్వం, సహజీవనం, ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి నేడు నిలబడాలన్నారు.

  ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు యుద్ధ మార్గాన్ని విడిచి శాంతి మార్గంలో నడవాలని కోరారు. యుద్ధం వల్ల ప్రపంచ శాంతి దెబ్బతింటుందని.. దీనికి వ్యతిరేకంగా మనం గళమెత్తాలన్నారు. భారతదేశం ఎప్పటి నుంచో శాంతి, సహజీవనం, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని యుద్ధ వ్యతిరేక పోరాటాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్య‌క్షులు అశోక్‌రెడ్డి, లెనిన్‌, పిడిఎస్‌యు రాష్ట్ర నాయ‌కులు ప‌వ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page