Saturday, September 19, 2026
No menu items!
HomeAPలోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపున‌కు కేంద్రం కీల‌క నిర్ణ‌యం

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపున‌కు కేంద్రం కీల‌క నిర్ణ‌యం

📰 Generate e-Paper Clip

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపున‌కు కేంద్రం కీల‌క నిర్ణ‌యం
లోక్‌స‌భ‌, అసెంబ్లీ స్థానాలు 50% పెంపు
తెలంగాణలో 179, ఏపీలో 263 కు పెర‌గ‌నున్న శాసనసభ సెగ్మెంట్లు
దేశంలో 543 నుంచి 816 కి లోక్‌స‌భ‌ స్థానాలు
2029 ఎన్నికల నుంచి అమల్లోకి !

ఢిల్లీ, మార్చి 24, అద్దం న్యూస్ :   అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816 కి చేరుతాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం ఉన్న 4,123 అసెంబ్లీ స్థానాలు 6,185 అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179 కి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263 కి చేరుతాయి. లోక్‌స‌భ‌ స్థానాలు ఏపీలో 25 నుంచి 38 కి, తెలంగాణలో 17 నుంచి 26 కి చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఈ నెల 22వ తేదీన ఎన్‌డిఏ భాగస్వామ్య పక్షాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది. లోక్‌స‌భ‌లో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 2027 మార్చి వరకు జనాభా లెక్కలు పూర్తి చేసి, ఆ నివేదిక ఆధారంగా పునర్విభజన చేసేందుకు ప్రణాళిక చేస్తోంది. 2029 ఎన్నికల నుంచి అమల్లోకి తేనున్న‌ట్లు స‌మాచారం.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page