Saturday, September 19, 2026
No menu items!
HomeTelanganaమావోయిస్టు కేంద్ర క‌మిటీ నాయ‌కుడు హిడ్మా మృతి – మారేడుమిల్లి అడవుల్లో ఎదురుకాల్పులు

మావోయిస్టు కేంద్ర క‌మిటీ నాయ‌కుడు హిడ్మా మృతి – మారేడుమిల్లి అడవుల్లో ఎదురుకాల్పులు

📰 Generate e-Paper Clip

అల్లూరి సీతారామ‌రాజు, న‌వంబ‌ర్ 17, అద్దం న్యూస్ :     అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్తు కేంద్ర క‌మిటీ నాయ‌కుడు హిడ్మా మృతి చెందారు. మారేడుమిల్లి ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య మంగ‌ళ‌వారం ఉద‌యం 6 నుంచి ఏడు గంట‌ల వ‌ర‌కు ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఆరుగురు మావోయిస్టుల మృతి చెందారని పోలీసులు తెలిపారు. వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందాడు. హిడ్మాతో పాటు ఆయ‌న భార్య రాధ మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన హిడ్మాపై రూ. కోటి, ఆయన భార్యపై రూ.50 లక్షల రివార్డ్‌ ఉంది. మావోయిస్టు పార్టీలో గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు మంచి పేరు ఉంది. ఆపరేషన్‌ కగార్‌ తీవ్రతరం అవడంతో చత్తీస్‌గఢ్‌ నుంచి మారేడుమిల్లి వైపు హిడ్మా టీమ్‌ వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు భద్రతా దళాలు భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టారు. సుక్మా జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా, మావోయస్ట్ కార్యకలాపాల్లో క్రియాశీలంగా వ్యవహరించారు. విలాస్, హిడ్మాల్, సంతోష్‌ అనే పేర్లతోనూ తిరిగిన హిడ్మా వయసు 50 ఏళ్లు పైనే ఉంది. హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై మంచి పట్టు ఉంది. దండకారణ్యంలో మావోయిస్టు కమిటీల్లో కీలకంగా మారిన హిడ్మా, 2017లో 25 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల మృతికి కారణమయ్యారు. గెరిల్లా వార్‌ఫేర్‌ స్కిల్స్‌లో హిడ్మాది తిరుగులేని టాలెంట్‌.



https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page