ప్లాస్టిక్ స్క్రాబ్ గోదాంలో భారీ పేలుడు – వ్యక్తికి తీవ్ర గాయాలు

ప్లాస్టిక్ స్క్రాబ్ గోదాంలో భారీ పేలుడు 

వ్యక్తికి తీవ్ర గాయాలు

భోల‌క్‌పూర్ లో ఘటన

పేలుడుకు పరుగులు తీసిన జనాలు

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం భోల‌క్‌పూర్ డివిజన్ గుల్షన్ నగర్ కట్నీకాంటా సమీపంలో ఓ ప్లాస్టిక్ స్క్రాబ్ గోదాంలో భారీ పేలుడు సంభవించడంతో కార్మికునికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కట్నీకాంటా సమీపంలో కరీం అనే వ్యక్తి ప్లాస్టిక్ స్క్రాబ్ గోదాం నిర్వహిస్తున్నాడు. అతని వద్ద బీహార్ కు చెందిన ఇసాక్ అహ్మద్ (28) ప్లాస్టిక్ వస్తువులను పగలగొట్టి భద్రపరిచే పనిచేస్తుంటాడు. ఇందులో భాగంగా గుర్తుతెలియని కెమికల్ డబ్బాను పగలగొడుతుండగా భారీ శబ్దంతో పేలడంతో పనిచేస్తున్న కార్మికుడు ఇసాక్ అహ్మద్ తీవ్ర గాయాలపాలు అయ్యాడు. ముఖము, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఇసాక్ అహ్మద్ ను ఆటోలో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ముషీరాబాద్ సీఐ రాంబాబు ఘటన స్థలానికి చేరుకోని వివరాలు సేకరించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిఇలా ఉంటే భారీ శబ్దం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page