...

యుపిహెచ్‌సిల‌లో వైద్య సౌకర్యాలు మెరుగు పరచాలి – ఐద్వా

హైదరాబాద్, జూన్  24, అద్దం న్యూస్ :   గ్రేటర్ హైదరాబాదు జిల్లా పరిధిలోని యుపిహెచ్‌సిల‌లో వైద్య సౌకర్యాలు మెరుగు పరచాలని ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.పద్మ, వై.వరలక్ష్మీ, సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మిలు కోరారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం వారు హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాదు జిల్లా పరిధిలో మొత్తం 93 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ( యుపిహెచ్‌సి ) లు ఉన్నాయని, వీటికి అనునిత్యం అనేక మంది గర్భిణీ స్త్రీలు వైద్యం కోసం, వైద్య పరీక్షల కోసం వస్తుంటారన్నారు.ఈ హెల్త్ సెంటర్లలో వైద్య సౌకర్యాలను మెరుగు పరచాలని, గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. గతంలో ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ప్రతి రోజూ 24 గంటలూ ఉంటూ కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో గర్భిణీ స్త్రీలకు ప్రసవించే సౌకర్యాలు కూడా ఉండేవని, ఆ విధమైన సౌకర్యాలను ఉపయోగించుకొని గర్భిణీ స్త్రీలు వారి ఇండ్ల దగ్గరలో అందుబాటులో ఉన్న ఈ హెల్త్ సెంటర్లలోనే ప్రసవించి ప్రైవేటు ఆసుపత్రులలో వేలకు వేలు ఫీజులు చెల్లించకుండా చాలా ఉపయోగకరంగా ఈ ఆసుపత్రులు ఉన్నాయని ఊరట చెందేవారన్నారు. అయితే క్రమంగా ఈ నాటికి చాలా యుపిహెచ్‌సిలలో ప్రసవాలు చేయడం ఆపివేశారన్నారు. నగరంలో 14 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు 24/7 సర్వీస్ సెంటర్స్ గా గుర్తించబడి ఉన్నాయని, వీటిలో పాన్ బజార్ రాణిగంజ్, పురానాపూల్ లాంటి 3- 4 సెంటర్స్ లో మాత్రమే ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. గగన్ మహల్, దోమలగూడ లలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో లేబర్ రూమ్, ప్రసవ గది, నలుగురు స్టాఫ్ నర్సులు, డాక్టర్, ఏఎన్ఎం సిబ్బంది ఉన్నప్పటికీ అక్కడ ప్రసవాలు ( డెలివరీస్ ) జరగడం లేదన్నారు. అన్నింటిలోనూ ప్రసవాలు జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా కోరారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.