ధ్యానం చేస్తే మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తోంది
– తెలంగాణ పంచాయతిరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు, తెలంగాణ అడ్వకేట్ జేఏసి కన్వీనర్ పులిగారి గోవర్థన్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 21, అద్దం న్యూస్ : ధ్యానం చేస్తే మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తోందని తెలంగాణ పంచాయతిరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు, తెలంగాణ అడ్వకేట్ జేఏసి కన్వీనర్ పులిగారి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలోని ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్‌లో గల ఇషా సెంటర్‌లో ఆదివారం ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులిగారి గోవర్థన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇషా సెంటర్ సభ్యులంతా ధ్యానం చేసి సద్గురు బోధించిన సూచనలను పాటించారు. ఈ సందర్భంగా పులిగారి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం ఏడు నిమిషాల పాటు ధ్యానం చేస్తే మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ధ్యానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. ధ్యానం అనేది ఒక మందులా పని చేస్తోందన్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర ద్వారా నలుగురు యువకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇషా సెంటర్ ప్రతినిధులు జలజ, పీఎం చక్రవర్తి, రాధిక, జయలేఖ, వశిష్ట, నంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply