Saturday, September 19, 2026
No menu items!
HomeAPAP Cm Chandrababu Naidu : చంద్ర‌బాబు నాయుడితో సికింద్రాబాద్ పార్ల‌మెంట్ టిడిపి నాయ‌కుల...

AP Cm Chandrababu Naidu : చంద్ర‌బాబు నాయుడితో సికింద్రాబాద్ పార్ల‌మెంట్ టిడిపి నాయ‌కుల భేటీ

📰 Generate e-Paper Clip

చంద్ర‌బాబు నాయుడితో సికింద్రాబాద్ పార్ల‌మెంట్ టిడిపి నాయ‌కుల భేటీ

ఆంధ్రప్రదేశ్, జూలై 28, ( అద్దం న్యూస్ ) :   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తో సికింద్రాబాద్ పార్లమెంట్ టిడిపి నాయకులు మంగ‌ళ‌వారం ఏపి స‌చివాల‌యంలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుకు ” తెలుగుదేశం ప్రజా పథం ” కార్యక్రమాల నివేదికను టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్‌, సికింద్రాబాద్ పార్ల‌మెంట్ కో–ఆర్డినేట‌ర్ న‌ల్లెల్ల కిషోర్‌, రాష్ట్ర బీసీ విభాగం మాజీ అధ్యక్షుడు, కాణిపాకం దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీపతి సతీష్ కుమార్, రాష్ట్ర ఎస్సీ విభాగం మాజీ అధ్యక్షుడు పోలంపల్లి అశోక్ త‌దిత‌రులు స‌మ‌ర్పించారు. గత మే 17వ తేదీన విజయవంతంగా నిర్వహించిన మినీ మహానాడు స్పూర్తితో, కార్యకర్తలను సమాయత్తం చేయడమే లక్ష్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టిన తెలుగుదేశం ప్రజాపథం పర్యటనల వివరాలను చంద్రబాబు నాయుడికి వివ‌రించారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమాల పట్ల నారా చంద్రబాబు నాయుడు అత్యంత సానుకూలంగా స్పందించి, నాయకులకు తగిన దిశానిర్దేశం చేశారు. రానున్న జిహెచ్‌ఎంసి ( GHMC ) ఎన్నికల సన్నాహకాలపై చంద్ర‌బాబు సానుకూలంగా స్పందించారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్లమెంట్ టిడిపి నాయకులు కాసుల సుదర్శన్ రెడ్డి, తడక వినోద్, శ్యామ్ సుందర్, కరణం కిరణ్, భాను ప్రకాష్, సిహెచ్.ప్రదీప్ గౌడ్ తదితరులున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page