Friday, September 18, 2026
No menu items!
HomeEducationమెంటల్ మ్యాథ్స్ “ మైండ్ స్పోర్ట్ ” గా ఎదుగుతోంది

మెంటల్ మ్యాథ్స్ “ మైండ్ స్పోర్ట్ ” గా ఎదుగుతోంది

📰 Generate e-Paper Clip

మెంటల్ మ్యాథ్స్ “ మైండ్ స్పోర్ట్ ” గా ఎదుగుతోంది
– సిప్‌ అబాకస్ జాతీయ మేనేజర్ ఉమా స్వామినాథన్

హైద‌రాబాద్‌, జూన్ 14, ( అద్దం న్యూస్ ) :  మెంటల్ మ్యాథ్స్ పదునైన మేధస్సును పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తుకు సిద్ధమవుతున్న పిల్లల కోసం ఒక కొత్త తరహా “ మైండ్ స్పోర్ట్ ” గా ఎదుగుతోందని సిప్‌ అబాకస్ జాతీయ మేనేజర్ ఉమా స్వామినాథన్ అన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన 120 మంది SIP అబాకస్ పూర్వ విద్యార్థుల విద్యా విజయాలను ఘనంగా సత్కరించేందుకు ఆదివారం నగరంలోని బాగ్‌లింగంప‌ల్లిలోని టీజీఎస్ ఆర్టీసీ కళాభవన్‌లో SIP అబాకస్ అచీవర్స్ సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని SIP అబాకస్ జాతీయ మేనేజర్ ఉమా స్వామినాథన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో SIP అబాకస్ తెలంగాణ రాష్ట్ర అధిపతి భరత్, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమా స్వామినాథన్ మాట్లాడుతూ… రాబోయే దశాబ్దంలో మెంటల్ మ్యాథ్స్, మేథో వికాసం, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, భవిష్యత్‌కు అవసరమైన సామర్థ్యాల అభివృద్ధికి అత్యంత ప్రభావవంతమైన సాధనంగా మారుతుందని తెలిపారు. నేడు తల్లిదండ్రులు, విద్యావేత్తలు కొన్ని కీలక ప్రశ్నలు అడుగుతున్నారని ఆమె పేర్కొన్నారు.

SIP అబాకస్ భారతదేశంలోని ప్రముఖ బాలల నైపుణ్యాభివృద్ధి సంస్థలలో ఒకటి అని, ఇది ఆరు సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా దేశ వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా పిల్లలకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, దృశ్యీకరణ, విశ్లేషణాత్మక ఆలోచన, వేగవంతమైన అభ్యాస నైపుణ్యాలను పెంపొందించే శిక్షణ కార్యక్రమాలను అందిస్తోంద‌ని తెలిపారు. ఏకాగ్రతను శిక్షణ ద్వారా పెంపొందించవచ్చా ? ఆత్మవిశ్వాసాన్ని నేర్పించవచ్చా ? మెంటల్ మ్యాథ్స్ విద్యా ఫలితాలను మెరుగుపరుస్తుందా ? మైండ్ స్పోర్ట్స్ అధిక స్క్రీన్ టైమ్‌కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయా ? చిన్న వయస్సులో మెదడు శిక్షణ భవిష్యత్‌కు సిద్ధమైన పిల్లలను తీర్చిదిద్దగలదా ? అనే అంశాలపై ఆసక్తి పెరుగుతోందన్నారు. సమ్మిట్‌లో భాగంగా విద్యార్థులు కాలిక్యులేటర్, కాగితం లేదా ఎలక్ట్రానిక్ పరికరాల సహాయం లేకుండానే క్లిష్టమైన అంకగణిత సమస్యలను క్షణాల్లో పరిష్కరించి తమ ప్రతిభను ప్రదర్శించారు. అలాగే కొందరు విద్యార్థులు క్రీడలు, నృత్యం, మార్షల్ ఆర్ట్స్ వంటి కార్యకలాపాలను ఒకేసారి నిర్వహిస్తూ మానసిక లెక్కలు చేయగల తమ సామర్థ్యాన్ని ప్రదర్శించిన వారు కూడా పాల్గొన్నారు. తమ ఏకాగ్రత, దృష్టి కేంద్రీకరణ, మల్టీటాస్కింగ్ నైపుణ్యాలను చూపించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page