తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితమే మంత్రి పొన్నం ప్రకటన
– 250 గజాల స్థలంతో పాటు ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ప్రకటించాలి
– తెలంగాణ ఉద్యమకారుల కమిటీ విధి విధానాలను వెంటనే రూపొందించాలి
» టియు జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 21, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితమే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారని తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమ అమరవీరుడు సిరిపురం యాదయ్య వర్ధంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని, 250 గజాల ఇంటి స్థలం ఏర్పాటు చేస్తామని, ఒక కమిటీ వేసి విధి విధానాల రూపొందిస్తామని ప్రకటించారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానం లాగా మారకూడదని వెంటనే ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన కమిటీని వేసి కార్యచరణను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత హామీలు లాగానే ఇది కూడా మారితే తెలంగాణ ఉద్యమకారుల సత్తాను మరో మారు చూపించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులు ఐక్యంగా ఉద్యమాలు నిర్వహిస్తే హక్కులు సాధించబడతాయని, తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం చేసిన ఉద్యమాల్లో పాల్గొన్న అందరికీ ఈ సందర్భంగా ఉద్యమ అభినందనలు తెలియచేస్తున్నామని తెలిపారు.![]()

![]()












Leave a Reply