హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత బర్త్ డే వేడుకలు గురువారం ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కవాడిగూడ డివిజన్‌లోని కొత్త బజార్ సాయిబాబా టెంపుల్ దగ్గర వికలాంగుడికి కృష్ణ గౌడ్‌కు ఉచితంగా త్రీ టైర్ స్కూటర్‌ను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అందచేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, నాయకులు కరికె కిరణ్ కుమార్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, వేణు యాదవ్, బాబురావు, సురేష్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, దీన్‌దయాల్‌రెడ్డి, రాజు యాదవ్, సాయి చాణక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply