నిస్వార్థ సేవకు మారుపేరు ఎమ్మెల్యే ముఠా గోపాల్
– ఎమ్మెల్సి దాసోజు శ్రవణ్
భోలక్‌పూర్, ఆగస్టు 17, ( అద్దం న్యూస్ ) : నిస్వార్థ సేవకు మారుపేరు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సి దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రజలకు చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్శిటీ ( హెచ్ఎస్‌సియు ) వారు ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ముషీరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు సన్మానం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ముఠా జైసింహ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సి దాసోజు శ్రవణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ… ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలనే నానుడిని ముఠా గోపాల్ పాటిస్తారన్నారు. 24 గంటల ప్రజల కోసం పాటుపడుతూ.. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ.. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరితో మర్యాదగా మాట్లాడే వ్యక్తి ముఠా గోపాల్ అని అన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదర్కొని ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని, భవిష్యత్‌లో రాజకీయంగా మరెన్నో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రేషం మల్లేష్, సిరిగిరి శ్యామ్, కల్వగోపి, కొండ శ్రీధర్‌రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, ఆకుల అరుణ్, సయ్యద్ అహ్మదుల్లా భక్తియారీ, మహ్మద్ అలీ, కొండా సహదేవ్, పోతుల శ్రీకాంత్, కరికె కిరణ్, కృపానంద్, బిక్షపతి యాదవ్, శ్రీకాంత్ ముదిరాజ్, ముదిగొండ మురళీ, చిట్టి శ్యామ్ సుందర్, ముచ్చకుర్తి పద్మ, మాధవి, స్రవంతి, ఎయిర్‌టెల్ రాజు, అబ్రార్ హుస్సేన్ ఆజాద్, మునావర్ చాంద్, జావీద్ ఖాన్, రాజేష్, బల్వంత్, సత్యనారాయణ బాబు, టిల్లు, బొట్టు శ్రీనివాస్, చింటు ప్రభాస్, మేడి సత్యనారాయణ, మణి, కనక మహాలక్ష్మీ, ఆర్.శ్రీనివాస్, యు.శ్రీధర్, మేరి, మహబూబ్ ఖాన్నితిన్, కార్తీక్ యాదవ్, బల్లెకరి రాములు, బల్లెకరి రమేష్, రఫియుద్దీన్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply