డ్రైనేజీ పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, డిసెంబర్ 15, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్‌లో నూతన డ్రైనేజి పైప్‌లైన్ పనులకు సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తలారి శ్రీకాంత్ ముదిరాజ్, అజయ్ ముదిరాజ్, ముచ్చకుర్తి ప్రభాకర్, ఎయిర్‌టెల్ రాజు నేత, స్థానికులు మంథన దశరథం, అశోక్, నరేష్, బాబు రావు తదితరులు పాల్గొన్నారు.![]()

![]()














Leave a Reply