కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందచేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్, సెప్టెంబర్ 18, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 183 లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ముషీరాబాద్ తహశిల్థార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశిల్థార్ చందన, కార్యాలయ సిబ్బంది రాహుల్, నిరంజన్ రెడ్డి, శివప్రసాద్, బిఆర్ఎస్ పార్టీ పలు డివిజన్ల అధ్యక్షులు శ్యామ్ యాదవ్, శంకర్ ముదిరాజ్, కార్యదర్శి దామోదర్ రెడ్డి, ముఠా నరేష్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీనివాస్ గుప్త, లబ్ధిదారులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply