భారీ జన సమీకరణతో మోడి బిజెపి బహిరంగ సభను జయప్రదం చేయాలి
– గాంధీనగర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి వడ్డపల్లి ఆనంద్ రావు
హైదరాబాద్, మే 9, ( అద్దం న్యూస్ ) : భారీ జన సమీకరణతో మోడి బిజెపి బహిరంగ సభను జయప్రదం చేయాలని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి వడ్డపల్లి ఆనంద్ రావు కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై సుమారు 8 వేల కోట్ల కేంద్ర నిధులతో ప్రారంభోత్సవాలు నిర్వహించి, సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బిజెపి బహిరంగ సభలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికి, బహిరంగ సభలో పాల్గొనేందుకు గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని ఆధ్వర్యంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ నేతృత్వంలో డివిజన్ బిజెపి శ్రేణులు, మహిళలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నామని గాంధీనగర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి వడ్డపల్లి ఆనంద్ రావు తెలిపారు. ప్రజలు అత్యధిక సంఖ్యలో ప్రజలు బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.![]()

![]()













Leave a Reply