సీపీఐకి మద్దతు ఇస్తామని చెప్పుకునే స్థితికి దిగ జారిన బీఆర్ఎస్ పార్టీ
బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు
• తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 14, అద్దం న్యూస్ : నార్త్ తెలంగాణలో బీజేపీకి ఫేవర్‌గా బీఆర్ఎస్ పనిచేసిందని, అందుకే బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు అని అన్నారు. ఉత్తర తెలంగాణలో గతంలో మంత్రులుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతలు చేతులేత్తేశారని, అసలు ప్రచారం కూడా చేయకుండా బీజేపీకి సహకరించారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపకుండా వదిలేయటంతోనే బిజెపి పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుందన్నారు. కొత్తగూడెంలో సీపీఐ అడగకుండానే వారికి మద్దతు ఇస్తామని చెప్పుకునే స్థితికి బీఆర్ఎస్ పార్టీ దిగ జారిందని కవిత ధ్వజమెత్తారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ… కాళేశ్వరం విషయంలో అసెంబ్లీలో కేసీఆర్ గారిపై ఆరోపణలు చేసిన వారికే మద్దతివ్వటమంటే కేసీఆర్ పై చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ అంగీకరించినట్లేనా అని అన్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ ట్రైలర్ మాత్రమే.. సినిమా మిగిలే ఉందని, మేం పార్టీ పెడతామనగానే బీఆర్ఎస్ లీడర్లు కారు కూతలు కూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు.
కాంగ్రెస్ అపొజిషన్‌లో ఉన్నప్పుడు వచ్చిన ఫలితాలతో బీఆర్ఎస్ పోల్చుకుంటుందన్నారు. గతంలో 90 శాతం మున్సిపాలిటీల్లో గెలిస్తే ఇప్పుడు 16 స్థానాలకే పరిమితం అయ్యారని, ప్రజల ప్రేమను ఎందుకు కోల్పోయారో బీఆర్ఎస్ సమీక్షించుకోవాలని అన్నారు. సీపీఐ అడగకుండానే బీఆర్ఎస్ మద్దతు ప్రకటిస్తోందని, అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సాంబశివరావు గారు కేసీఆర్ పై చేసిన ఆరోపణలను ఆమోదిస్తున్నారా ? అని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో మిలాఖత్ అయిన సీపీఐకి మద్దతివ్వటమంటే నయవంచనే అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జాగృతికి చెందిన 40 మంది అభ్యర్థులను ప్రజలు గెలిపించారన్నారు. మా లాంటి కొత్త తరహా రాజకీయాల చేసే వారిని ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని.. అల్టర్ నేట్ లేకనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారన్నారు. ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ఎక్కడ కూడా నిలబెట్టుకోకుండానే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచిందన్నారు. ఇక ప్రజలు మాకు గుడి కట్టారంటూ ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాలకు పడిపోయిందన్నారు. తెలంగాణకు రూపాయి ఇవ్వని బీజేపీ కరీంనగర్ మేయర్ స్థానం తప్ప అన్ని చోట్ల అష్టకష్టాలు పడిందని… కానీ ఈ ఎన్నికల్లో మాలాంటి న్యూ ప్లేయర్‌ను ప్రజలు ఆదరించారన్నారు. త్వరలోనే మేము రాజకీయ పార్టీగా మారబోతున్నామని చెప్పి ఎన్నికల్లో పోటీ చేశామని, సమయం తక్కువగా ఉన్నప్పటికీ మా కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి పోటీ చేశామని కవిత తెలిపారు.
గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తమకు 17 స్థానాలు వచ్చుడే ఎక్కువ అన్నట్లుగా మాట్లాడారని.. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు 5 శాతం సీట్లు కూడా రాలేదని అంటున్నారన్నారు. కాంగ్రెస్ అపొజిషన్‌లో ఉన్నప్పుడు ఉన్న స్థానాలతో ఆయన పోల్చుకుంటున్నారని… కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దానితో పోల్చుకుంటే బీఆర్ఎస్ చాలా స్థానాలు కోల్పోయిందని తెలిపారు. ఈ ముఖ్యమంత్రి నేనే రాజు, నేనే మంత్రి అంటున్నారని విమర్శించారు. పదేళ్లు ముఖ్యమంత్రి నేనే.. నాకు ఆరు నెలలు బోనస్ వస్తుందని చెబుతున్నారన్నారు. ముందు రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం కుర్చీ లాక్కుంటా అని రాజ్ గోపాల్ రెడ్డి అంటున్నాడన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అట్టర్‌గా ఫెయిల్ అయ్యిందన్నారు. వాళ్లకు ఏ సిర్ఫ్ ట్రైలర్ హై, పిక్చర్ బాకీ హై అని కవిత స్పష్టం చేశారు. ఇప్పుడే కారుకూతలు కూయకండి అని హెచ్చరించారు. ఉద్యమకారులను మంచి చేయాలని నేను మాట్లాడితే నా మీద ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని… ఇలాంటి అహంకారం తగ్గించుకొని ప్రజల మధ్యలో ఉండకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయన్నారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేలా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అన్నట్లుగా నార్త్‌లో ఒకరికి ఒకరు సహకరించుకున్నారన్నారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి,హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఫార్వర్డ్ బ్లాక్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఆర్‌విఆర్.ప్రసాద్, జాగృతి ప్రధాన కార్యదర్శి ఎల్.రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.![]()
![]()
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply