Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadనాయి బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి రాజకీయ రంగాలలో రాణించాలి – తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మ‌ణ...

నాయి బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి రాజకీయ రంగాలలో రాణించాలి – తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మ‌ణ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు దేవ‌ర‌కొండ నాగ‌రాజు

📰 Generate e-Paper Clip

నాయి బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి రాజకీయ రంగాలలో రాణించాలి
» తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మ‌ణ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు దేవ‌ర‌కొండ నాగ‌రాజు

హైదరాబాద్, జనవరి 6, అద్దం న్యూస్ : నాయి బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి రాజకీయ రంగాలలో రాణించాలని తెలంగాణ నాయి బ్రాహ్మ‌ణ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు దేవ‌ర‌కొండ నాగ‌రాజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర‌ నాయి బ్రాహ్మ‌ణ సంఘం ఆధ్వ‌ర్యంలో రూపొందించిన నూత‌న సంవ‌త్స‌ర క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ బాగ్‌లింగంపల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌ కేంద్రంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సంఘం అభివృద్ధి కోసం కృషి చేసిన సీనియ‌ర్ నాయ‌కుల‌కు స‌న్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు దేవ‌ర‌కొండ నాగ‌రాజు మాట్లాడుతూ… నాయి బ్రాహ్మ‌ణుల హ‌క్కుల కోసం సంఘం పాటుప‌డుతుంద‌న్నారు. రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. సెలూన్ల‌కు విద్యుత్ బిల్లు 250 యూనిట్లలోపు ‘0’ బిల్లు అమలు చేయాలని, ఆ పైన వాడిన యూనిటి కి ఎంత అయితే అంత బిల్లు ఇవ్వాలన్నారు. నాయిబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన నిర్మాణం పూర్తి చేయాల‌ని, ఆ నిర్వాహ‌ణ‌కు ఒక‌ కమిటి వేసి అప్పగించాలన్నారు. దేవాలయ పాలకమండలిలో ఒక నాయిబ్రాహ్మణుడిని సభ్యుడుగా తీసుకోవాల‌ని, కులం పేరుతో దూషించిన వారిపై చర్యలకు జీవో ఇవ్వాలన్నారు.

          నాయిబ్రాహ్మణ ఫెడరేషన్‌కి పాలక కమిటీని ఏర్పాటు చేయాలని, నాయిబ్రాహ్మణులకు ఒక నామినేటెడ్ ఎంఎల్‌సి ఇవ్వాల‌న్నారు. నాయిబ్రాహ్మణ క్షౌర వృత్తిలోకి ఇతరుల ప్రవేశాన్ని అరికట్టాలని, 2026-27 బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించాల‌న్నారు. 50 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు నిండిన నాయిబ్రాహ్మణులకు పెన్షన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరాల వెంకటస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వర్ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి రామచందర్, హరినాథ్, జయప్రభూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రెటరీ చంద్రశేఖర్, రాష్ట్ర అడ్వైజర్ ఏముల సుధాకర్ ల‌తో పాటు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మ‌ణ సంఘం నాయ‌కులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page