నాలాల్లో పడి గల్లంతైన వారి కోసం గాలింపు
– అఫ్జల్‌సాగర్, వినోభానగర్‌లో పర్యటించిన హైడ్రా కమిషనర్, కలెక్టర్ హరిచందన
నాలా ఆక్రమణలే ప్రమాదాలకు కారణం
– హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్, సెప్టెంబర్ 15, అద్దం న్యూస్ : నాలాల్లో పడి ఆదివారం గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం హైడ్రా ముమ్మరంగా గాలిస్తోంది. క్యాచ్‌పిట్లన్ని చోట్ల వెతుకుతోంది. ఆసిఫ్‌నగర్‌లోని అఫ్జల్‌సాగర్ నాలాతో పాటు.. ముషీరాబాద్‌లోని వినోభానగర్ నాలా పరిసరాల్లో గాలింపు చర్యలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో సోమవారం ఉదయం పరిశీలించారు. ప్రతి క్యాచ్పిట్ను తెరిచి చూసిన తర్వాత వెంటనే వాటిని మూసి వేయాలని హైడ్రా సిబ్బందిని ఆదేశించారు. గాలింపు చర్యలను మిగతా శాఖలతో కలిసి ముమ్మరం చేయాలని సూచించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కూడా అఫ్జల్‌సాగర్ ప్రాంతంలో కమిషనర్‌తో పాటు గాలింపు చర్యలను పరిశీలించారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కురిసిన భారీ వర్షానికి ఆసిఫ్‌నగర్‌లోని అఫ్జల్ సాగర్ నాలాలో అక్కడే నివాసం ఉంటున్న మామ, అల్లుడు అర్జున్ ( 26 ), రాము ( 25 )తో పాటు.. ముషీరాబాద్‌లోని వినోభానగర్ నాలాలో దినేష్ అలియాస్ సన్నీ ( 26 ) గల్లంతైన విషయం విధితమే. ముషీరాబాద్ వినోభానగర్ నాలాలో సన్ని కి చెందిన ద్విచక్ర వాహనాన్ని నాలాలో గుర్తించారు. ఇంకా సన్ని ఆచూకి తెలియలేదు.
నాలా ఆక్రమణలే ప్రమాదాలకు కారణం : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

నాలాల ఆక్రమణలే ప్రమాదాలకు కారణమని గాలింపు చర్యలను పరిశీలించిన అనంతరం మీడియాతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ… నాలాలను ఆక్రమించి నిర్మించడమే కాకుండా.. వాటి ప్రవాహాన్ని అశాస్త్రీయంగా దారి మల్లించడంతో వరద సాఫీగా సాగడంలేదన్నారు. వరద ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఒకటి రెండు కట్టడాలనే తొలగిస్తామని.. మిగతా వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని కమిషనర్ స్పష్టం చేశారు. నాలాల చెంతన పేదలే ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. తప్పనిసరై కూల్చి వేయాల్సి వస్తే వారికి ప్రత్యామ్నాయం ప్రభుత్వం చూస్తుందన్నారు. మిగతావారెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. పేదల పట్ల ప్రభుత్వానికి ఆ సింపతీ ఉందని.. హైడ్రా కూడా అదే తీరుతో పని చేస్తున్నదని చెప్పారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో పాటు నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ సిఐ రాంబాబు, ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహ, జార్జ్ తదితరులున్నారు.












Leave a Reply