Saturday, September 19, 2026
No menu items!
HomeAPప‌లుస బాల్‌రాజ్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో నారా లోకేష్ బ‌ర్త్ డే వేడుక‌లు

ప‌లుస బాల్‌రాజ్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో నారా లోకేష్ బ‌ర్త్ డే వేడుక‌లు

📰 Generate e-Paper Clip

ప‌లుస బాల్‌రాజ్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో నారా లోకేష్ బ‌ర్త్ డే వేడుక‌లు

హైదరాబాద్, జ‌న‌వ‌రి 23, అద్దం న్యూస్ :    తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ చిక్కడపల్లిలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ పలుస బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నారా లోకేష్ బర్త్ డే వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అదే వీధిలో పేదలకు పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాల్రాజ్ గౌడ్ మాట్లాడుతూ.. నారా లోకేష్ భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డి.చంద్రమోహన్ గౌడ్, శంకర్, ఉదయ్ కుమార్ గుప్తా, పుల్లయ్య, టి.నాయుడు, గోపాల్, యాదగిరి, అన్నపూర్ణ, వీణా తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page