Saturday, September 19, 2026
No menu items!
HomeAPఅపవాదులను జయించి, అసమాన నాయకుడిగా ఎదిగిన నారా లోకేష్ – టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్...

అపవాదులను జయించి, అసమాన నాయకుడిగా ఎదిగిన నారా లోకేష్ – టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్

📰 Generate e-Paper Clip

అపవాదులను జయించి, అసమాన నాయకుడిగా ఎదిగిన నారా లోకేష్
– టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్

హైదరాబాద్, జ‌న‌వ‌రి 23, అద్దం న్యూస్ :   అపవాదులను జయించి, అసమాన నాయకుడిగా నారా లోకేష్ ఎదిగార‌ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ 43వ జ‌న్మ‌దిన వేడుక‌లు శుక్ర‌వారం హైద‌రాబాద్ టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ హాజ‌రై కేక్ క‌ట్ చేసి టిడిపి నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు తినిపించారు. ఈ సంద‌ర్భంగా అర‌వింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… లోకేష్ రాజకీయ ప్రస్థానం మరియు పార్టీకి ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు. వారసత్వం నుండి స్వశక్తి వరకు ఆయన ప్రస్థానం చూస్తే, నారా లోకేష్ కేవలం స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా, చంద్రబాబు నాయుడి కుమారుడిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని అరవింద్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాజకీయ వారసత్వంతో ప్రవేశించినా, తండ్రి సుపరిపాలనను దగ్గర నుండి గమనిస్తూ, ఉన్నత చదువులు చదివి ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. విమర్శలను పటాపంచలు చేస్తూ… రాజకీయ ప్రవేశం చేసిన కొత్తలో ప్రత్యర్థి పార్టీలు, ఆయనకు రాజకీయాలు తెలియవని ఎన్ని సార్లు హేళన చేసినా కానీ లోకేష్ వాటన్నిటినీ తన పట్టుదల, అనుభవం. విజ్ఞానంతో చేధించి ప్రజల్లో తనదైన ముద్ర వేసారని కొనియాడారు. లోకేష్ బాబు పార్టీ మెంబర్‌షిప్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే, దేశంలోనే మొట్టమొదటిసారిగా కోట్లాది మంది కార్యకర్తలను సభ్యులుగా చేర్చి రికార్డు సృష్టించారని, ఇది ఆయన పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న స్తబ్దతను తొలగించి, పార్టీని మళ్లీ క్రియాశీలం చేయాలని అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉండాలని, ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లోకేష్ నాయకత్వం తెలుగు జాతికి అండగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణలోని ప్రతి తెలుగుదేశం కార్యకర్త సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, తడక వినోద్, శ్యామ్ సుందర్, భాను ప్రకాష్, వెంకటేష్ చౌదరి, జాన్సీ, ప్రమీల, కరణం కిరణ్, ఎస్.ప్రకాష్, గండికోట విజయ్, చంద్రమోహన్ గౌడ్, పి.బాలకృష్ణ, బి.రాజు, శక్తిప్రేమ్, జగదీష్ గౌడ్, సుక్రవేది, బిక్షపతిచారి, నర్సింహా గౌడ్, యాదగిరి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page