Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadజాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షునిగా మార్క ర‌మేష్ యాద‌వ్ నియామ‌కం

జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షునిగా మార్క ర‌మేష్ యాద‌వ్ నియామ‌కం

📰 Generate e-Paper Clip

జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షునిగా మార్క ర‌మేష్ యాద‌వ్ నియామ‌కం

హైదరాబాద్, అక్టోబ‌ర్ 25, అద్దం న్యూస్ :     జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షునిగా మార్క ర‌మేష్ యాద‌వ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాముల యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గంగనబోయిన రవి యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షునిగా మార్క రమేష్ యాదవ్ ను ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షునిగా నియ‌మించారు. ఈ సంద‌ర్భంగా ర‌మేష్ యాద‌వ్‌కు నియామ‌క‌ప‌త్రాన్ని అంద‌చేసి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా మార్క ర‌మేష్ యాద‌వ్ మాట్లాడుతూ… త‌న పై న‌మ్మ‌కంతో త‌న‌ను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడిగా నియ‌మించినందుకుగాను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాముల యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గంగనబోయిన రవి యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల కిరణ్ యాదవ్ ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌చేశారు. యాద‌వుల హ‌క్కుల కోసం కృషి చేస్తాన‌న్నారు. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నాయ‌క‌త్వం ఏ పిలుపు ఇచ్చినా అందుకు త‌గ్గ‌ట్టు సంఘం కోసం ప‌ని చేస్తాన‌న్నారు.


Advertisement


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page