Saturday, September 19, 2026
No menu items!
Homecinemaటాటా సియెర్రా మళ్లీ వస్తోంది.. ఈసారి కొత్త హంగులతో!

టాటా సియెర్రా మళ్లీ వస్తోంది.. ఈసారి కొత్త హంగులతో!

📰 Generate e-Paper Clip

భారత ఆటోమొబైల్ చరిత్రలో కొన్ని కార్లు మాత్రమే తమదైన ముద్ర వేసి, ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. హిందుస్థాన్ అంబాసిడర్, మారుతి 800, జిప్సీ వంటి కార్లతో పాటు టాటా సియెర్రా కూడా ఈ జాబితాలో ఉంటుంది. ఇప్పుడు, ఆ పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ, ఐకానిక్ సియెర్రా ఎస్‌యూవీని సరికొత్త హంగులతో తిరిగి తీసుకురావడానికి టాటా మోటార్స్ సిద్ధమైంది. ఈ నెల 25న ఈ ఆధునిక సియెర్రా భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ రూపంలో అందరినీ ఆకట్టుకున్న సియెర్రా, ఇప్పుడు ప్రొడక్షన్ మోడల్‌గా రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ ప్రకారం, పాత సియెర్రాలోని కొన్ని క్లాసిక్ డిజైన్ అంశాలను కొనసాగిస్తూనే, ఆధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో దీనిని తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా, 90వ దశకంలోని సియెర్రాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఆల్పైన్ విండో డిజైన్‌ను కొత్త మోడల్‌లోనూ కొనసాగించడం విశేషం. బ్లాక్-అవుట్ పిల్లర్ల సహాయంతో ఈ ప్రత్యేకమైన గ్లాస్ రూఫ్ లుక్‌ను సాధించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page