Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADటిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఘ‌నంగా ఎన్‌టిఆర్ జ‌యంతి

టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఘ‌నంగా ఎన్‌టిఆర్ జ‌యంతి

📰 Generate e-Paper Clip

టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఘ‌నంగా ఎన్‌టిఆర్ జ‌యంతి

హైద‌రాబాద్‌, మే 28, ( అద్దం న్యూస్ ) :   తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి టిడిపి న‌గ‌ర నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాలరాజ్ గౌడ్ హాజ‌రై కాసుల సుదర్శన్ రెడ్డి, ఎం.శ్యామ్ సుందర్, తడక వినోద్, ఎంకె.బోసు, బాను ప్రకాష్, ఎస్.ప్రకాష్, బి.రాజు, యాదగిరి, మచ్చేంద్ర, రాహుల్ తదితరులతో క‌లిసి పార్టీ జెండాను ఎగుర‌వేశారు. ఎన్‌టిఆర్‌ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ‘ జై ఎన్టీఆర్ ‘, ‘ ఎన్టీఆర్ అమర్ రహే ‘, ‘ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి ‘ నినాదాలు చేసారు. ఎన్టీఆర్ ఆశయాలను, ఆయన ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యక్రమాలు రూపొందించాలని బాల్‌రాజ్ గౌడ్ పిలుపునిచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page