జిఎస్‌టి తగ్గింపు కై ధన్యవాదాలు మోడీ జి పేరుతో పాదయాత్ర – పాద‌యాత్ర‌లో పాల్గొన్న‌ రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌

జిఎస్‌టి తగ్గింపు కై ధన్యవాదాలు మోడీ జి పేరుతో పాదయాత్ర

– పాద‌యాత్ర‌లో పాల్గొన్న‌ రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 22, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ న‌గ‌రంలోని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో సోమ‌వారం జిఎస్‌టి తగ్గింపు కై ధన్యవాదాలు మోడీ జి పేరుతో పాదయాత్ర జ‌రిగింది. చిక్కడపల్లి నుండి అశోక్‌న‌గ‌ర్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ వరకు పాద‌యాత్ర జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిజెపి ఓబిసి మోర్చ జాతీయ అధ్య‌క్షుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మెడికల్, కిరాణ‌, ఎలక్ట్రికల్ త‌దిత‌ర దుకాణాల‌ యజమానులను కలుస్తూ పాదయాత్ర కొనసాగించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్‌.ల‌క్ష్మణ్ మాట్లాడుతూ… జిఎస్‌టి సవరణలో పన్ను తగ్గించి, దేశ ప్రజలకు దీపావళి బహుమతిని అందచేసిన ప్రధాని నరేంద్ర మోడి కి ప్ర‌జ‌లు ధన్యవాదాలు తెలియచేస్తున్నార‌న్నారు. జిఎస్‌టి తగ్గింపు, మన దేశానికి నరేంద్ర మోడీ అందచేసిన చారిత్రాత్మక దీపావళి కానుక అని అన్నారు. ఈ రోజు తగ్గిన జిఎస్‌టి పన్ను భారాన్ని ప్రజలు, వ్యాపారస్తులు, దుకాణం యజమానులు స్వాగతిస్తున్నారన్నారు.

వైద్యానికి సంబంధించిన మందులు, వైద్య పరికరాలు, ఆరోగ్య బీమాలాపై పూర్తిగా జిఎస్‌టి ఎత్తివేయడంతో పాటు ఇతర వాటిపై 18 నుండి 5 శాతానికి పన్ను మినహాయింపు నిర్ణయం ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు. పాదయాత్రలో వ్యాపారస్తులకు కలిసి జిఎస్‌టి తగ్గింపున‌కు సహకరించాలని, ప్రతి షాప్, వ్యాపార స్థలాల్లో జిఎస్‌టి తగ్గింపు వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్య‌క్షుడు జి.భ‌రత్ గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్, క‌వాడిగూడ డివిజ‌న్ కార్పొరేట‌ర్ జి.ర‌చ‌న శ్రీ, డివిజన్ల అధ్యక్షులు, మహిళా మోర్చ నాయకులు, సీనియర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page