ఖమ్మం, అద్దం న్యూస్ : వనజీవి పద్మశ్రీ దరిపల్లి రామయ్య ( వనజీవి రామయ్య) కన్నుమూశారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి రామయ్య స్వస్థలం. శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో ఆయనను ప్రభుత్వాస్పత్రికీ తరలించగా చికిత్స పొందుతూ రామయ్య మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయస్సు 85 సంవత్సరాలు. జీవితమంతా మొక్కలు నాటి పెంచిన ఆయన ఇంటి పేరే వనజీవి అయింది. కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త రికార్డును రామయ్య సృష్టించారు. అందుకుగాను 2017లో రామయ్యను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply