ఉగ్ర‌దాడి మృతుల‌కు శాంతియుత ర్యాలీ

 

ఉగ్ర‌దాడి మృతుల‌కు శాంతియుత ర్యాలీ

హైదరాబాద్, ఏప్రిల్ 25, అద్దం న్యూస్ :  జమ్మూ కాశ్మీర్ ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌వాదుల కాల్పుల్లో మృతిచెందిన హిందువుల ఆత్మ‌లకు శాంతి చేకూరాల‌ని శాంతియుత ర్యాలీ జ‌రిగింది. బిజెవైఎం ముషీరాబాద్ అసెంబ్లీ క‌న్వీన‌ర్ గ‌డ్డం న‌వీన్ ఆధ్వ‌ర్యంలో గురువారం రాత్రి రాంన‌గ‌ర్‌లో జ‌రిగిన ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద ఉగ్ర‌దాడి మృతుల‌కు నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…ఏ అభంశుభం తెలియని అమాయకులపై దాడి చేసి దారుణహత్యలకు పాల్పడడం సరైంది కాదని, నేటి సమాజంలో హింసకు తావు లేదన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేటర్ రవిచారి, బిజెపి నాయ‌కులు ర‌మేష్‌, సాయి కృష్ణ యాదవ్, గడ్డం సతీష్, కంచి ముదిరాజ్‌, ఇల్లందుల రాకేష్, మేకలు సత్యనారాయణ, నేరెళ్ల రాకేష్, ఈ.రాకేష్, వివేకానంద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఉగ్ర‌దాడి మృతుల‌కు శాంతియుత ర్యాలీని నిర్వ‌హిస్తున్న దృశ్యం.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page