పెండింగ్‌లో ఉన్న స్కాల‌ర్‌షిప్‌, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి – ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు అశోక్‌రెడ్డి

పెండింగ్‌లో ఉన్న స్కాల‌ర్‌షిప్‌, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి

– ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు అశోక్‌రెడ్డి

ఖైరతాబాద్, సెప్టెంబ‌ర్ 01, అద్దం న్యూస్ :    పెండింగ్‌లో ఉన్న స్కాల‌ర్‌షిప్‌, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమ‌వారం ఖైరతాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో అశోక్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8158 కోట్ల దాకా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు పెండింగ్‌లో ఉన్నాయ‌న్నారు. విద్యార్థులు సర్టిఫికెట్స్ తీసుకుందామంటే డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. విద్యార్థులు డబ్బులు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామని ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థల యాజ‌మాన్యాలు చెబుతున్నాయ‌న్నారు. విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత మూడు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ బకాయిలు విడుదల రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న కూడా ఇప్పటి వరకు రాష్ట్రానికి విద్యశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి పెండింగ్‌లో ఉన్నటువంటి స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను వెంటనే విడుదల చేయాలని… లేదంటే మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లెనిన్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీమన్, స్టాలిన్, సహాయ కార్యదర్శి రజినీకాంత్ ఖైరతాబాద్ జోన్ నాయకులు ఆంజనేయులు, ప్రవీణ్, కార్తీక్, మనోజ్, గర్ల్స్ కమిటీ సభ్యులు శివాని, సంగీత తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page