మాజీ సీఎం కెసిఆర్‌కు సిట్ నోటీసులు
అద్దం న్యూస్, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, భారత్ రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ ) అధినేత కేసిఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందచేశారు. రేపు ( 30 వ తేదీన ) విచారణ చేస్తామని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. 2023లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రత్యేక విచారణ బృందం ( సిట్ ) తన పరిధిని విస్తృతం చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏకంగా 618 మంది ఫోన్లు ట్యాప్ చేసి, రహస్యంగా సంభాషణలు విన్నారని తీవ్ర అభియోగాలున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసి, సీరియస్‌గా ప్రభుత్వం విచారిస్తోంది. ఇందులో భాగంగా ఈ 20 న మాజీ మంత్రి హరీష్‌రావును, 23 న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నోటీసులిచ్చి పిలిపించి గంటల తరబడి సిట్ విచారించింది. నిన్న కాక మొన్న మాజీ ఎంపి సంతోష్‌రావును సిట్ అధికారులు 5 గంటల పాటు విచారించారు. ఇక తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు.
నంది నగర్‌లో కేసీఆర్ ఇంటికి మరోసారి పోలీసులు :
సిట్ విచారణ కారణంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నంది నగర్‌లోనే కేసీఆర్‌ను విచారిస్తే భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే పోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పీఏకు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని నోటీసులు ఇచ్చారు.














Leave a Reply