జ‌నాభా ప్రాతిప‌దిక‌న షెడ్యూల్డ్ కులాల‌ రిజ‌ర్వేష‌న్ల‌ను 15 శాతానికి పెంచాలి

జ‌నాభా ప్రాతిప‌దిక‌న షెడ్యూల్డ్ కులాల‌ రిజ‌ర్వేష‌న్ల‌ను 15 శాతానికి పెంచాలి

హైద‌రాబాద్‌, జూలై 24, ( అద్దం న్యూస్ ) :   జ‌నాభా ప్రాతిప‌దిక‌న షెడ్యూల్డ్ కులాల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ను 8 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని బిజెపి ఎస్సీ మోర్చ మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డం న‌వీన్ హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ ప్రియాంక అల‌ ను కోరారు. ఈ మేర‌కు శుక్ర‌వారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాలకు మేరకు క‌లెక్ట‌ర్‌ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా గ‌డ్డం న‌వీన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కానీ, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కానీ ఎస్సీల జ‌నాభా పెరిగింద‌ని, పెరిగిన జ‌నాభాక‌నుగుణంగా రిజ‌ర్వేష‌న్ల‌ను 15 శాతానికి పెంచాల‌ని కోరారు. దాని ప్ర‌కారం రాబోయే జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల సీట్ల‌ను కేటాయించాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులు, జిల్లా ఎస్సీ మోర్చ‌ నాయకులు ఎస్.రాజు, అంబాల రాజేష్, నరేష్, ఐడిహెచ్ కాలనీ శీనన్న, జగదీష్, సాయిలు, రాజ్ మల్లేష్, ఫణి కుమార్, రాకేష్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page