రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత పౌరులందరిపై ఉంది – హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న‌

రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత పౌరులందరిపై ఉంది
» హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న‌

హైదరాబాద్, జ‌న‌వ‌రి 24, అద్దం న్యూస్ :   రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత పౌరులందరిపై ఉందని హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న దాస‌రి అన్నారు. రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా శ‌నివారం హైద‌రాబాద్ ముషీరాబాద్ డిపో ఆవ‌ర‌ణ‌లో ఆర్ఎం హెచ్ఆర్ సుధా పరిమళ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాస ఉత్సవాలు జ‌రిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ కలెక్టర్ హరి చందన, ట్రాన్స్‌ఫోర్ట్ జాయింట్ క‌మిష‌న‌ర్ సి.రమేష్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, ముషీరాబాద్‌ డిపో మేనేజర్ రఘు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా స్కూల్ విద్యార్థుల‌కు సేఫ్టీ మీద ఎస్ఏ రైటింగ్ కాంపిటీష‌న్‌, డ్రాయింగ్ మీద పోటీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ముషీరాబాద్ డిపో తరపున ఎస్సే రైటింగ్, రోడ్ సేఫ్టీ మీద డ్రాయింగ్ వేసి విజేతలు అయిన నృపతుంగ హై స్కూల్ స్కూల్ విద్యార్థులు మణిదీప్, భావేష్, సుశాంత్ లకు హైదరాబాద్ కలెక్టర్ హరి చందన చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, షీల్డ్‌ల‌ను అంద‌చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు టీచర్లు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

ప్ర‌మాద‌ర‌హిత డ్రైవ‌ర్ల‌కు న‌గ‌దు పారితోషికం :

ముషీరాబాద్ డిపో నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగస్తులకు ప్రగతి చక్రం అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. హైద‌రాబాద్‌ రీజినల్ మేనేజర్ సుధా పరిమళ ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ముషీరాబాద్ డిపో నుండి ఎంపికైన ప్రమాద రహిత డ్రైవర్లు ఎంఎం.అలీ, నిరంజన్, బిఎం.గౌడ్ ల‌ను సత్కరించి.. నగదు పారితోషకం అందించారు. మంచి డ్రైవింగ్ మెళ‌కువలతో ఆయిల్ సేవ్ చేసిన డ్రైవర్లైన బి.యాదయ్య, టి.యాదయ్య, పి.రాజు లను ప్రశంసా ప‌త్రాల‌ను, నగదు పారితోషికంతో స‌త్క‌రించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page