విధి నిర్వహణలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి – సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి

హైదరాబాద్, నవంబర్‌ 24 అద్దం న్యూస్ :    విధి నిర్వహణలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి అన్నారు. సోమవారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని రామకృష్ణమఠంలో నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ‘ఒక గొప్ప మార్పు ఇదే శ్రీకారం’ అనే కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్ సబ్ డివిజన్‌లోని పోలీసు అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రై డిసిపి శిల్ప‌వ‌ల్లి మఠం సిబ్బందితో, శిక్షణలో పాల్గొన్న సిబ్బందితో సాన్నిహిత్యంగా మాట్లాడి, వారి అనుభవాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా డిసిపి శిల్ప‌వల్లి మాట్లాడుతూ… సమాజ శ్రేయస్సులో ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలన్నారు. ప్రజా సేవలో క్రమశిక్షణ, సహనం, సమన్వయం, పరస్పర గౌరవం వంటి విలువలను అనుసరించడం ద్వారా జీవితంలో మార్పు, మెరుగైన పనితీరును సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ ఏసీపీ ఎ.యాదగిరి, దోమలగూడ సీఐ ఎండి.అంజ‌ద్ అలీ, గాంధీనగర్ సీఐ కిర‌ణ్‌, దోమలగూడ, గాంధీనగర్ డీఐ ఆర్.వెంకటేశ్వర్లు, ఎస్ఐలు శ్రీనివాస్ రెడ్డి, విజయ్, హరీష్, సర్సింహ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page