అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా వ్య‌భిచారం – నిర్వాహ‌కుల‌ను అరెస్ట్ చేసిన నారాయ‌ణ‌గూడ పోలీసులు

 

అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా వ్య‌భిచారం

– నిర్వాహ‌కుల‌ను అరెస్ట్ చేసిన నారాయ‌ణ‌గూడ పోలీసులు

 

హైదరాబాద్, మే 8, అద్దం న్యూస్ :   హిమాయ‌త్‌న‌గ‌ర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా కొన‌సాగుతున్న వ్య‌భిచారాన్ని నారాయ‌ణ‌గూడ పోలీసులు ర‌ట్టు చేశారు. నారాయ‌ణ‌గూడ పోలీస్‌స్టేష‌న్ సిఐ చంద్ర‌శేఖ‌ర్‌, ఎస్ఐ వెంక‌టేష్‌, ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ క‌రుణాక‌ర్‌రెడ్డి, సిబ్బందితో క‌లిసి అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్ పై దాడి చేశారు. . సిఐ చంద్ర‌శేఖ‌ర్ తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి… క‌డ‌ప జిల్లాకు చెందిన సంగ‌టి నాగేశ్వ‌ర్‌రెడ్డి ( 56 ), నెల్లూరు జిల్లాకు చెందిన సి.ప్ర‌భావ‌తి ( 61 ) లు డ‌బ్బు ఆశ‌తో హిమాయ‌త్‌న‌గ‌ర్ ఆశ్ర‌య్ మ్యాన్ష‌న్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నంబ‌ర్  302లో గుట్టుచ‌ప్పుడు కాకుండా వ్య‌భిచారాన్ని నిర్వ‌హిస్తున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం అందుకున్న నారాయ‌ణ‌గూడ పోలీస్‌స్టేష‌న్ సిఐ చంద్ర‌శేఖ‌ర్‌, ఎస్ఐ వెంక‌టేష్‌, ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ క‌రుణాక‌ర్‌రెడ్డి, సిబ్బందితో క‌లిసి ఈ నెల 7వ రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్ పై దాడి చేశారు. ఇద్ద‌రు నిర్వాహ‌కుల‌తో పాటు 3 వేల రూపాయ‌ల న‌గ‌దును, ఆరు కండోమ్స్‌, రెండు సెల్ ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను విచారించారు. నిర్వాహ‌కులు సంగ‌టి నాగేశ్వ‌ర్‌రెడ్డి, సి.ప్ర‌భావ‌తి ల‌ను గురువారం రిమాండ్‌కు త‌ర‌లించారు. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను కోర్టు ముందు ప్ర‌వేశ‌పెట్టి కోర్టు ఆదేశాల మేర‌కు ప్ర‌జ్వ‌ల హోమ్‌కు త‌ర‌లించ‌డం జ‌రుగుతుంద‌ని సిఐ తెలిపారు. సంగ‌టి నాగేశ్వ‌ర్‌రెడ్డి గ‌తంలో 2004లో చిక్క‌డ‌ప‌ల్లి పిఎస్ ప‌రిధిలో, 2008లో పంజాగుట్ట పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో, 2012లో జూబ్లీహిల్స్ పిఎస్ ప‌రిధుల్లో వ్య‌భిచారం నేరంలో అరెస్ట్ అయ్యాడ‌ని సిఐ తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page