లిడ్‌క్యాప్ భూముల ప‌రిర‌క్ష‌ణ చేయండి – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ను కోరిన మంద‌క్రిష్ణ మాదిగ‌, ఆరేప‌ల్లి రాజేంద‌ర్‌

లిడ్‌క్యాప్ భూముల ప‌రిర‌క్ష‌ణ చేయండి

– మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ను కోరిన మంద‌క్రిష్ణ మాదిగ‌, ఆరేప‌ల్లి రాజేంద‌ర్‌

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 09, అద్దం న్యూస్ :    లిడ్‌క్యాప్ భూముల ప‌రిర‌క్ష‌ణ చేయాల‌ని మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి జాతీయ అధ్య‌క్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, మాదిగ మేధావుల ఫోరం అధ్య‌క్షుడు, తెలంగాణ చ‌ర్మ‌కారుల సంఘాల జేఏసి ఛైర్మ‌న్ డాక్ట‌ర్‌.ఆరేపల్లి రాజేందర్ లు కోరారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం వారు రాష్ట్ర స‌చివాల‌యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు లిడ్‌క్యాప్ భూముల పరిరక్షణకు కృషి చేయాల‌ని మంత్రిని కోరారు. ఈ సంద‌ర్భంగా మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి జాతీయ అధ్య‌క్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, మాదిగ మేధావుల ఫోరం అధ్య‌క్షుడు, తెలంగాణ చ‌ర్మ‌కారుల సంఘాల జేఏసి ఛైర్మ‌న్ డాక్ట‌ర్‌.ఆరేపల్లి రాజేందర్ లు మాట్లాడుతూ… LIDCAP భూముల పరిరక్షీంచాలని వెంటనే పునరుద్ధరించి చైర్మన్ డైరెక్టర్లను నియమించి 12 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి ట్రైనింగ్ చేసిన మాస్టర్స్ ఆర్టిజెన్స్, మాదిగ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించాలని కోరారు. ఇప్పటికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి యథావిధిగా LIDCAP కార్పొరేషన్ కొనసాగుతుంద‌ని, దానికి చైర్మన్, డైరెక్టర్లను నియమించి బడ్జెట్ కేటాయిస్తున్నారని తెలిపారు.                                          తెలంగాణ‌లో మాదిగల మంత్రిగా మీరు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ల‌కు వివరించి LIDCAP పునః ప్రారంభించి చైర్మన్ డైరెక్టర్లను నియమించి 12 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి గచ్చిబౌలిలోని లిడ్ క్యాప్ TGLIPC భూములలో యూనిట్ మాల్, ఇతరులకు పెట్రోల్ బంక్ లీజు జిఓ ఆర్‌టి 137 ను రద్దు చేసి క్యాన్సిల్ లెటర్ ఇవ్వాలని మంత్రిని కోరారు. గత ప్రభుత్వంలో కలెక్టర్ కార్యాలయాలకు, స్మశాన వాటికలు, క్రీడ ప్రాంగణాలు, రైతు వేదిక లకు తీసుకుని భవనాలు నిర్మించారని, అలా కాకుండా చేవెళ్ల డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం మాకు కేటాయించిన అస్సైండ్ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page