Saturday, September 19, 2026
No menu items!
HomeTelanganaకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసించండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసించండి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అద్దం న్యూస్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిర‌న‌స‌లు తెలియ‌చేయాల‌ని ఏఐయుకెఎస్ జాతీయ నాయ‌కుడు రంగ‌య్య అన్నారు. హైదరాబాదులోని మార్క్స్ భవన్‌లో రాష్ట్ర ఆఫీస్ బీరర్స్ సమావేశం జరిగింది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ రైతాంగంపట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు వినాశనకరంగా ఉన్నాయని సమావేశం అభిప్రాయపడింది. ఈ సంద‌ర్భంగా ఏఐయుకెఎస్ జాతీయ నాయ‌కుడు రంగ‌య్య మాట్లాడుతూ… రైతులు సుదీర్ఘంగా చేసిన ఫలితంగా ఉపసంహరించిన నల్లచట్టాలను దొడ్డిదారిన ప్రవేశపెట్టే ఎత్తుగడలో భాగంగా నూతన వ్యవసాయ మార్కెట్ విధాన ముసాయిదా బిల్లును తెచ్చారన్నారు. తీరా 50 రోజులకు పైగా ఆమరణ దీక్షకు పూనుకున్న దాల్లేవాలాను చర్చలకు ఆహ్వానించి అరెస్టు చేయటం దారుణం అన్నారు. కేంద్రంలోని బీజేపీ, పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వాలు ఉద్యమాలను అణ‌చివేయాల‌ని చూస్తున్నాయని అన్నారు. అరెస్టు చేసిన 300 మంది రైతులను జైలుకు పంపడం, శంభు, కనౌరి బార్డర్ లో ఆందోళన చేస్తున్న రైతుల దీక్ష శిబిరాలను కూల్చటం, బుల్‌డోజ‌ర్ల‌తో సామాగ్రిని విరగ్గొట్టటం కంటే క్రూరత్వం ఏముంటుందని ప్రశ్నించారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ ఎస్‌కెఎం పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన జరిగే ఆందోళనల్లో రైతులు, ఏఐయుకెఎస్ కార్యకర్తలు విస్తృతంగా పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. ఏఐయుకెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని తెలిపారు. 2 లక్షల లోపు రుణమాఫీ అసంపూర్తిగా చేసి చేతులు ఎత్తి వేసిందని చెప్పారు. మే 8వ తేదీన హైద‌రాబాద్ ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్‌లో భారీ ధర్నా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐయుకెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాము, సహాయ కార్యదర్శులు దేవారామ్, నంది రామయ్య, సురేష్, రాష్ట్ర కోశాధికారి అవుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page