ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించిన పులిగారి గోవర్థన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 27, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అశోక్‌నగర్‌లోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 110 జయంతి కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ అడ్వకేట్ జేఏసి కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర మాజీ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి, మాజీ బీసీ కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బాపూజీ న్యాయవాది దేశ స్వతంత్య్ర కోసం పోరాడిన దేశ భక్తుడని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసి 94 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ సాధన కొరకు పాటుబడిన మహా నేత కొండ లక్ష్మణ్ బాపూజీ అని ఆయన అన్నారు. మంత్రి పదవి కాకుండా ఆఖరికి తనకు ఉన్న ఇల్లును కూడా రాష్ట్ర సాధన కొరకు టిఆర్ఎస్ పార్టీకి, చంద్రబాబు నాయుడు దాసికానికి చివరి రోజుల్లో కిరాయి ఇంట్లో ఉంటూ ఉద్యమాన్ని ముందుకు నడిపిన నాయకుడన్నారు. మంత్రి పదవిలే కాకుండా సామాజిక ఉద్యమకారుడిగా దేశ భక్తుడిగా మంచి మనసున్న నేతగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌టెల్ రాజు, పున్న సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply