Putin: హైదరాబాద్ హౌస్‌లో పుతిన్‌కు ఆతిథ్యం.. అది ఎవరి నివాసమో తెలుసా..?

హైదరాబాద్ హౌస్లో పుతిన్ కు ఆతిథ్యం

రష్యా అధ్యక్షుడి బస అక్కడే

170 కోట్ల ఖరీదైన బంగళా ఇది

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మాణం

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్యాదిమీర్ పుతిన్ (Putin) భారత్ లో పర్యటించనున్నారు. ఢిల్లీలోని హైదరాబా ద్ హౌస్ లో ఆయనకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పట్లు చేసింది. ఏ దేశ అధ్యక్షులైనా మన దేశంలో పర్యటిస్తే దీని గడప తొక్కాల్సిందే. అతిథిగా రాచమర్యాదల రుచి చూడాల్సిందే. నిజాం ప్రభువుల కలల సౌధంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం దేశ రాజధాని నగరంలో హైదరాబాద్ దర్పానికి నిర్మాణానికి రెండేండ్లు ప్రతిబింబం.

నగరం నడిబొడ్డున దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హైదరా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఢిల్లీలో తమ విడిది కోసం ఒక భవనం ఉండాలని భావించారు. అందుకోసం విదేశీ వాస్తు శిల్పి ఎడ్విన్ లుటియినను ఈ బాధ్యతలను అప్పగించాడు. 1926లో ప్రారంభమైన ఈ నిర్మాణం రెండేండ్లలో పూర్తయింది. యూరోపియన్ మొఘలుల శైలిని కలగలుపుతూ దీనిని నిర్మించారు. ఎత్తైన గుమ్మటం దీని ప్రధాన ఆకర్షణ. బర్మా నుంచి తెప్పించిన టేకును ఇందులో వినియోగించారు. లండన్, న్యూయార్క్లల అలంకరణ శైలిని అనుసరించారు. బాద్ హౌస్ ఎందరో ప్రముఖులకు ఆహ్వానం పలికింది. 1926లో ఈ హైదరాబాద్ హౌస్ నిర్మాణం ప్రారంభం కాగా.. 1928లో పూర్తయింది.

హైదరాబాద్ చివరి నిజాం మిర్‌ ఉస్మాన్ అలీఖాన్ దీనిని ప్రారంభించారు. అప్పుడు దీనికి అయిన ఖర్చు రెండు లక్షల పౌండ్లు. అప్పుడు అధికారంలో ఉన్న బ్రిటిషర్లు దేశ రాజధానిని దిల్లీకి మార్చగా.. తన ఖ్యాతికి తగ్గట్టుగా అలీఖాన్ (Mir Osman Ali Khan) దీనిని నిర్మించుకున్నారు. ఈ హైదరాబాద్‌ హౌస్‌ ఎందరో ప్రముఖులకు ఆహ్వానం పలికింది. అందులో అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ఉన్నారు. పుతిన్‌ (Putin) గతంలో ఇక్కడ ఆతిథ్యం పొందారు కూడా.

నేడు ద్వైపాక్షిక చర్చలు..

ఈ రోజు ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్ కు అధికారిక స్వాగత కార్యక్రమం జరగనుంది. అనంతరం రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ, పుతిన్ తో పాటు ఇతర నేతలు నివాళులు అర్పించనున్నారు. తదుపరి పరిమిత స్థాయి చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షికస్థాయి, ప్రతినిధి బృందస్థాయి చర్చలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ప్రతినిధులతో కలిసి భోజన కార్యక్రమం నిర్వహిస్తారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page