ముషీరాబాద్ ఆర్టీసి డిపో నూతన మేనేజర్‌గా రఘు బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, అక్టోబర్ 24, అద్దం న్యూస్ : ముషీరాబాద్ ఆర్టీసి డిపో నూతన మేనేజర్‌గా టి.రఘు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రఘు మాట్లాడుతూ… డిపో ఉద్యోగస్తులందరూ కూడా కలసి కట్టుగా పనిచేసి డిపో అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్నారు. విధులకు గైర్హాజరవ్వకుండా పూర్తిస్థాయిలో బస్సులను నడపాలని, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన డిపో మేనేజర్ టి.రఘు కు ఉద్యోగస్తులందరూ ఘన స్వాగతం పలికారు.
Advertisement
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply