ఆకుల సురేందర్‌కు నివాళి అర్పించిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్

హైదరాబాద్, సెప్టెంబర్ 18, అద్దం న్యూస్ : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బిజెపి నాయకుడు ఆకుల సురేందర్ సంతాప సభ గురువారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్‌గౌడ్, బిజెపి నాయకులు నవీన్, శివ, శ్రీకాంత్, గోపాల్ హాజరై ఆకుల సురేందర్ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేందర్ కుటుంబ సభ్యులు ఆకుల అభిషేక్, ఆకుల శ్రీనివాస్ లను పరామర్శించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply