పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ పార్శిగుట్ట వద్ద ర్యాలీ
సికింద్రాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ : జమ్మూకాశ్మీర్ పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఎంఆర్‌పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఉగ్ర దాడుల్లో మరణించిన టూరిస్టుల ఆత్మ శాంతి కై పార్శిగుట్ట చౌరస్తా వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ న్యూ అశోక్‌నగర్, పార్శిగుట్ట నుండి పార్సిగుట్ట చౌరస్తా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పిఎస్ నాయకులు మాట్లాడుతూ… పహల్గామ్ వద్ద అమాయక పర్యాటకులు, పౌరులపై రాష్ట్ర ప్రాయోజిత ఆటవిక దాడి భారత దేశ సార్వభౌమత్వంపై జరిగిన దాడి అని అన్నారు. ఈ ప్రాంతంలో శాంతి, సాధారణ స్థితికి తీసుకొస్తారని ఆశిస్తూ ఈ దుఃఖ క్షణంలో బాధితుల కుటుంబాలకు భారతదేశం అంతా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌పి హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగ, అర్బన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు పిట్టల ఓం ప్రకాష్ ముదిరాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రసమల్ల బాచి, నేతాజీ విద్య స్థాధల కరస్పాండెంట్ కోట్ల నిరంజన్ రెడ్డి, నాయకులు రఘు మాదిగ, తుమ్మల శివప్రసాద్ మాదిగ, డప్పు మహేష్ మాదిగ, వెంకటేష్ మాదిగ, బిజెవైఎం బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షులు లడ్డు, అర్బన్ డెవలప్మెంట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మైక్ సెట్ అశోక్, ఎడ్ల రుద్ర మాదిగ, మణికంఠ ముదిరాజ్, సిరి, బండ్ల గణేష్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply