Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఅర్హులంద‌రికి రేష‌న్ కార్డులు మంజూరు చేయాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్...

అర్హులంద‌రికి రేష‌న్ కార్డులు మంజూరు చేయాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ :   అర్హులంద‌రికి రేష‌న్ కార్డులు మంజూరు చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. మంగ‌ళ‌వారం స‌హాయ పౌర స‌ర‌ఫ‌రాల అధికారిణి దీప్తితో ఆమె కార్యాల‌యంలో గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్‌కుమార్ రేష‌న్ కార్డుల మంజూరు విష‌యంలో స‌మీక్ష చేశారు. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని చిక్క‌డ‌ప‌ల్లి, బాపూన‌గ‌ర్‌, వివి గిరిన‌గ‌ర్, ఎస్ఆర్‌టి, స‌బ‌ర్మ‌తిన‌గ‌ర్ బ‌స్తీవాసులు ద‌ర‌ఖాస్తులు చేసుకున్న రేష‌న్ కార్డుల‌ను మంజూరు చేయాల‌ని కార్పొరేట‌ర్ పావ‌ని కోరారు. త్వ‌రిత‌గ‌తిన ఎంక్వైరీ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసి అర్హులంద‌రికి రేష‌న్ కార్డుల‌ను ఇవ్వాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయా బ‌స్తీవాసుల‌తో పాటు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, సీనియర్ సివిల్ ఇన్‌స్పెక్ట‌ర్ స్వర్ణలత, చెకింగ్ ఇన్‌స్పెక్ట‌ర్ రెహ‌మాన్‌, బీజేపీ నాయకులు ఆనంద్ రావు, సాయి కుమార్, రాజేందర్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page