హైదరాబాద్ నగర గ్రంథాలయంలో గణతంత్ర వేడుకలు
హైదరాబాద్, జనవరి 26, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగర గ్రంథాలయంలో సోమవారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాదు నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి పొట్లూరి పద్మజ, చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ సిఐ రాజు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ…. భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉందని, వారికి కావాల్సిన మౌలిక వసతులు అన్ని కల్పిస్తామన్నారు. కష్టపడి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మౌనిక, కానిస్టేబుళ్లు, ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు చంద్రకళ, ప్రతిభారెడ్డి, అవినాష్, వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, బొల్లం మహేందర్, రామ్మోహన్, విద్యార్థినీ, విద్యార్థులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.![]()














Leave a Reply