శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, జనవరి 26, అద్దం న్యూస్ : హైదరాబాద్ అడిక్‌మెట్‌లో శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ ఫైనాన్షియల్ అడ్వయిజర్, ఇండియన్ లైఫ్ అండర్ రైటర్ సూరి సీతారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీ పింగళి వెంకయ్యకు దేశ అత్యున్నత పురస్కారము అవార్డు భారత రత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. గత సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ వ్యవస్థాపకురాలైన కెహెచ్ఎస్.జగదాంబ అనారోగ్యంతో మృతి చెందడం వల్ల కోడూరు శ్రీదేవిని ట్రస్ట్ నూతన చైర్మన్‌గా బలపరుస్తూ చైర్‌పర్సన్ కోడూరు శ్యామల రావు, బంగారు ప్రశాంత్, సుధాకర్ రెడ్డి బలపర్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రొయ్యూరు శేషసాయి, మేడి సత్యనారాయణ, శ్రీకాంత్, అనుదీప్, లక్ష్మణ్, వెంకటేశ్వర్ తదితరులు హాజరయ్యారు.![]()














Leave a Reply