జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో ద‌ళితుల‌కు 46 డివిజ‌న్ల‌ల్లో రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలి

జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో ద‌ళితుల‌కు 46 డివిజ‌న్ల‌ల్లో రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలి  

» జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్‌కు విన‌తి ప‌త్రాన్ని అంద‌చేసిన తెలంగాణ ద‌ళిత ఐక్య వేదిక‌

హైదరాబాద్, జ‌న‌వ‌రి 20, అద్దం న్యూస్ :   రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో దళితులకు కనీసం 46 డివిజన్ల‌ల్లో రిజర్వేషన్‌ చేయాలని తెలంగాణ దళిత ఐక్య వేదిక నాయ‌కులు కోరారు. ఈ మేర‌కు తెలంగాణ దళిత ఐక్య వేదిక నాయ‌కుడు శ్యామ్ సుందర్ చిట్టి ఆధ్వర్యంలో ఐక్య వేదిక నాయ‌కులు గండి కృష్ణ‌, స‌త్య‌నారాయ‌ణ‌, ప‌రిమ‌ల్ కుమార్‌, సిరిగిరి శ్యామ్‌, వివేక్, గ‌డ్డం న‌వీన్, రామ‌స్వామి, హ‌రీష్‌, జ్ఞాని, సాయిలు, తిరుమ‌లేష్‌, సురేష్‌, రాంచంద‌ర్,  సదా, టిల్లు త‌దిత‌రులు జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ ఆర్‌వి.క‌ర్ణ‌న్‌ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు.

ఈ సంద‌ర్భంగా ఐక్య వేదిక నాయ‌కులు చిట్టి శ్యామ్ సుంద‌ర్ మాట్లాడుతూ… 2011 జ‌నాభా ప్ర‌కారం 150 డివిజ‌న్లు ఉన్ప‌ప్పుడు 14 శాతం ప్ర‌కారం ద‌ళితుల‌కు 23 డివిజ‌న్ల‌ను రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్పుడు పెంచిన 300 డివిజ‌న్ల‌కుగాను 14 శాతం ప్ర‌కారం ద‌ళితుల‌కు 46 డివిజ‌న్ల‌ను కేటాయించాల‌న్నారు. 2011 నాటి జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం 23 డివిజ‌న్ల‌ను కేటాయించ‌డం తీర‌నిలోట‌న్నారు. ప్ర‌తి 10 సంవ‌త్స‌రాల‌కు జ‌న‌గ‌న‌ణ జ‌ర‌గాలి కానీ.. ఇప్ప‌టికి 15 సంవ‌త్స‌రాల క్రితం తీసిన లెక్క‌ల ఆధారంగానే ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం ద‌ళితుల‌కు తీర‌ని అన్యాయ‌మ‌న్నారు. 300 డివిజ‌న్ల‌ల్లో 46 డివిజ‌న్ల‌ను ద‌ళితుల‌కు రిజ‌ర్వేష‌న్ కేటాయించాల‌ని, లేని ప‌క్షంలో ద‌ళితులంద‌రూ ఏక‌మై ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నిర‌స‌న చేప‌డుతామ‌ని హెచ్చ‌రించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page