Saturday, September 19, 2026
No menu items!
HomeEducationపోరాట ఫలితమే కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా

పోరాట ఫలితమే కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా

📰 Generate e-Paper Clip

పోరాట ఫలితమే కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా
– తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరసయ్య

హైద‌రాబాద్‌, జూలై 25, ( అద్దం న్యూస్ ) :  దేశ వ్యాప్తంగా విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున చేసిన పోరాట ఫలితమే నియంతృత్వ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా అని తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు సాధించిన విజయమని కొనియాడారు. యువత తలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఈ పరిణామం ఆయన పేర్కొన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామాతో జరిగిన నష్టాన్ని పూడ్చ‌లేర‌ని, దోషులను కఠినంగా శిక్షించడంతో పాటు చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు రానున్న కాలంలో నీట్ ప‌రీక్ష‌ను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో నిర్వహించాలని కేంద్రానికి నరసయ్య డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థుల పక్షాన నిలబడి పోరాటం చేసిన దేశ యువతకు తెలంగాణ జన సమితి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుందని ఆయన వెల్లడించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page