Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADక‌లుషిత నీటి స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి

క‌లుషిత నీటి స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి

📰 Generate e-Paper Clip

క‌లుషిత నీటి స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి
– బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ముఠా జ‌య‌సింహ‌

అడిక్‌మెట్‌,  జూన్ 18, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ బాయి గల్లి బస్తీలో కలుషిత నీరు సరఫరా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముఠా జయ సింహ అన్నారు. బ‌స్తీవాసుల ఫిర్యాదు మేర‌కు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి జ‌య‌సింహ బాయి గల్లీ బ‌స్తీలో పర్యటించారు. బస్తీలో వస్తున్న మంచినీటి సరఫరాలో మురుగునీరు, దుర్వాస‌న‌తో కూడిన‌ కలుషితమై వస్తున్నాయని, ఆ నీటిని తాగితే అనారోగ్యాల పాలవుతున్నామని  ఈ సందర్భంగా మహిళలు వాపోయారు. ఈ సందర్భంగా కలుషిత నీటిని పరిశీలించిన జయ సింహ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి బాయి గ‌ల్లి బ‌స్తీలో చాలా రోజుల నుండి క‌లుషిత నీటి స‌ర‌ఫ‌రా సమస్య ఉందని, తాగేందుకు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కలుషిత నీటి సరఫరా కాకుండా త‌గిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్యాంసుందర్ ( చిట్టి ), ధర్మ, రామస్వామి, మాధవ్ తదితరులతో పాటు బస్తివాసులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page