మంచినీటి, కలుషిత నీటి సమస్యను పరిష్కరించండి
– వాటర్‌వర్క్స్ కార్యాలయం ఎదుట రాంనగర్ హరినగర్ వాసుల ధర్నా

హైదరాబాద్, మే 26, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ హరినగర్ దక్షిణ భారత సేవా సమాజ్ తదితర ప్రాంతాల్లో మంచినీటి సరఫరా సరిగ్గా రావడంలేదని, వచ్చిన కాసేపు కూడా కలుషిత నీరు వస్తుందని, ఆ సమస్యను పరిష్కరించాలని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా బస్తీవాసులు మంగళవారం జలమండలి నారాయణగూడ జిఎం కార్యాలయంతో పాటు చిలకలగూడ వాటర్ వర్క్స్ డిజిఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా హరినగర్ నివాసి, బిజెవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడ్డం నవీన్ మాట్లాడుతూ… దయారా మార్కెట్ వద్ద గల బంధన్ ఫంక్షన్‌హాల్ వద్ద పైప్‌లైన్ డ్యామేజ్ వల్ల మంచినీటిలో కలుషిత నీరు సరఫరా అవుతుందని, లో ప్రెషర్‌తో సరఫరా అవుతుందన్నారు. దీని వల్ల హరినగర్ దక్షిణ భారత సేవా సమాజ్ తదితర బస్తీల్లో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసలే వేసవి కాలం కావడం… దానికి తోడు లో ప్రెషర్ సమస్య ఉండటంతో స్థానిక ప్రజలు నీటి కోసం ఇబ్బందులుపడుతున్నారని తెలిపారు. దానికి తోడు కలుషిత నీటిని తాగి అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం జీఎం శ్రీధర్‌రెడ్డికి, డిజిఎం విష్ణువర్థన్ లకు వినతి పత్రాలను అందచేశారు. ఈ ధర్నాలో గడ్డం బాలకృష్ణ, నేరెళ్ల బాలయ్య, ప్రసాద్, రాజు, నేరెళ్ల అమర్, గజ్జల జ్ఞానేశ్వర్, మేకల సత్యనారాయణ, మహేష్, ఈరేలి రాకేష్, రావర్తి క్రాంతి, వెంకట్, నవీన్, ఆకాష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.![]()

![]()

